కొనుగోళ్ల లో జాప్యం చేస్తున్న మిల్లర్లు : సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాలను భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు సందర్శించారు అక్కడి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి మాట్లాడుతూ రైతుల దగ్గర తాలు పేరుతో క్వింటాల్ కి ఐదు కేజీలు తగ్గించడం అత్యంత అమానుషం అని ఆన్నారు యాసంగి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఐకెపి సొసైటీ కొనుగోలు కేంద్రాలు వద్ద  రైతులు పండించిన పంటకు సరిపడా ప్యాడి  క్లీనర్ లేకపోవడం ఉన్నచోటే కరెంట్ సౌకర్యం లేకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్యాడి  క్లీనర్లు లేకపోవడం వలన ట్రాక్టర్లకు ఫ్యాన్లు కు వడ్లు  పడుతున్నారని రైతులకష్టాల పై అధికారులపర్యవేక్షణ లేదు అన్నారు నూర్పిడి పట్టిన ధాన్యాన్ని మాత్రమే  కొనుగోలు చేస్తామని రైస్ మిల్లర్లు కొర్రీలు  పెట్టడం వలన కళ్ళల్లో  ఉన్న ధాన్యం దగ్గర వారాల పాటు రైతుల పడిగాపులు  పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు రైతులు ను ఇబ్బందులకు గురిచేస్తున్న  రైస్ మిల్లర్ల పైప్రభుత్వం  చర్య  తీసుకోవాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాజీవ్ రహదారి నిర్బందిస్తామని హెచ్చరించారు రైతే రాజు అని మాట్లాడి ఇప్పుడు రైతులు రోడ్డుఎక్కే  పరిస్థితి తీసుకు వస్తున్నారని మండిపడ్డారు రానున్న రెండు రోజుల్లో వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ మొత్తుకుంటే  నిమ్మకునీరెత్తినట్లు అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు కొనుగోలు చేసిన మూడు రోజుల్లో  రైతులకు డబ్బులు జమచేయాలనీ  డిమాండ్  చేసారు  ఈకార్యక్రమంలో  సిపిఐ  మండల సహాయ  కార్యదర్శి  చొక్కాల  శ్రీశైలం  మండల  నాయకులు  మొలుగూరి  సంపత్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆంజనేయులు,రమేష్ రామచంద్రం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post