భార‌త్‌లో క‌రోనాపై న్యూయార్క్ టైమ్స్ వ‌క్రీక‌రించిన క‌థ‌నం - కొట్టిపారేసిన భారత్

 


భారత దేశం లో  క‌రోనా కేసులు, మ‌ర‌ణాల‌పై అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాప‌త్రిక న్యూయార్క్ టైమ్స్ త‌మ వెబ్‌సైట్‌లో ఇటీవ‌ల సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. భార‌త్‌లో క‌రోనా బారిన ప‌డి మే 24 నాటికి 16 ల‌క్ష‌ల మంది మృతి చెంది ఉండొచ్చ‌ని తెలిపింది. అలాగే కరోనా కేసులు ఏకంగా 70 కోట్లు ఉండొచ్చ‌ని పేర్కొంది. అయితే, న్యూయార్క్ టైమ్స్ వెబ్ సైట్లో మే 25న ప్ర‌చురించిన ఈ క‌థ‌నాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కొట్టిపారేసింది. వ‌క్రీక‌రించిన అంశాల‌ ఆధారంగా భార‌త్‌లో కొవిడ్ కేసులు, మ‌ర‌ణాల గురించి గ‌ణాంకాలపై న్యూయార్క్ టైమ్స్ అంచ‌నా వేసింద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఆ ప‌త్రిక ప్ర‌చురించిన గ‌ణాంకాలు నిరాధార, త‌ప్పుడు లెక్క‌ల‌ని వివరించింది. కాగా, మే 24 నాటికి 3.07 లక్షల మంది మృతి చెందార‌ని, మొత్తం క‌రోనా కేసులు 2.69 కోట్ల‌ వ‌ర‌కు వున్నాయని భారత ప్రభుత్వ గ‌ణాంకాలు చెబుతున్నాయి.



0/Post a Comment/Comments

Previous Post Next Post