నేడు కబడ్డీ పోటీలు ప్రారంభం-కుప్పకూలిన ప్రేక్షకుల గ్యాలరీ!



సూర్యాపేటలో జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలి 150 మందికి గాయాలయ్యాయి. గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన జరిగింది.ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీలో దాదాపు 1,500 మంది ప్రేక్షకులు ఉన్నట్టు గుర్తించారు. గాయపడినవారిని 108 సిబ్బంది, పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. కాగా జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు విచ్చేశారు.

https://twitter.com/i/status/1374001217966252037

0/Post a Comment/Comments

Previous Post Next Post