విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం మండల అధ్యక్షులు గా గోకుల కొండ సత్యనారాయణ ఎన్నిక



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శనివారం గౌడ కమ్యూనిటీ భవనము లో విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం మండల అధ్యక్షులు ఎన్నికలు జరిగాయి ఎలక్షన్ ఆఫీసర్ తిప్పారం అంజయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఈ ఎన్నికల్లో గన్నేరువరం గ్రామానికి చెందిన దేశరాజు కనకయ్య మాదాపూర్ గ్రామానికి చెందిన గోకుల కొండ సత్యనారాయణ పోటీలో ఉన్నారు ఈరోజు ఉదయం ఎలక్షన్ ప్రారంభం కాగా మండలంలోని కులస్తులు పురుషులు స్త్రీలు, కలిసి 277 ఓట్లు పోల్ కాగా మాదాపూర్ గ్రామానికి చెందిన గోకుల కొండ సత్యనారాయణ కు139 ఓట్లు రాగా ఒక్క ఓట్లతో గెలుపొందాడు, దేశరాజు కనకయ్య కు 138 ఓట్లు రాగా ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యాడు  అనంతరం మండల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కలిసి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన గోకుల కొండ సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు అనంతరం గన్నేరువరం మండల కేంద్రంలో ర్యాలీగా వెళ్లి టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో తిప్పర్తి నాగార్జున చారి,గూడూరి రాజయ్య, బొమ్మకంటి లక్ష్మీరాజ్యం, గూడూరి నాగరాజు, దేశ రాజు సాయి , గూడూరి నవీన్,గూడూరి సురేష్ ,తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post