కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై మండల ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు వడ్లకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీచర్లు తో కలిసి ప్లే కార్డు తో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తక్షణం పాఠశాలను తెరవాలని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు వడ్ల కొండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు . మండలంలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద వివిధ పాఠశాలల్లో పనిచేసే ప్రైవేట్ టీచర్స్ అందరు కలిసి ప్లే కార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం పాఠశాలలో మూసివేయడంతో ఉపాధి కోల్పోయామని ఇల్లు గడవడానికి కష్టంగా మారిందని వివిధ రంగాల వారిని ఆదుకున్న ప్రభుత్వం ప్రవేట్ టీచర్లను విస్మరించడం తగదని వెంటనే ప్రభుత్వం కరోనా భృతిని ప్రకటించి ఆదుకోవాలని లేనిపక్షంలో తగిన నిబంధనలతో పాఠశాలలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు ప్రైవేటు ఉపాధ్యాయులు కూలీలుగా మారి పనులకు పోవడం జరుగుతుందని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని వెంటనే ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ ఆదుకోవాలని అన్నారు రు ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సిపిఐ మండల శాఖ నాయకులు కాంతార అంజిరెడ్డి చుక్కల్లో శ్రీశైలం సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్స్ కు న్యాయం చేసే వరకు సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో లో కరస్పాండెంట్ లు చాడ రంగారెడ్డి ఏల సంపత్ ఉపాధ్యాయులు బొడ్డు కృష్ణ తాళ్ల పెళ్లి చంద్రమౌళి తిప్పర్తి చంద్రశేఖర్,మారం మల్లేశం కొమ్మెర శ్రీకాంత్ రెడ్డి నలిగేటి రాజు, బారిగెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment