గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ధోనికేని కృష్ణ, ఎన్ఆర్ఐ పాలసీ సాధనే లక్ష్యంగా చేపట్టిన గల్ఫ్ కార్మికుల మహా పాదయాత్ర నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు 958కిలోమీటర్లు జనవరి 4 వ తేదీన ప్రారంభం అయ్యి పిబ్రవరి 16 వ తేదీన మంగళవారం హైదరాబాద్ లో గల్ఫ్ ధూంధాం "గల్ఫ్ కార్మికుల మహాసభ" ద్వారా ముగుస్తుంది గల్ఫ్ కార్మికుల మహా సభకు మద్దతుగా ఒమాన్ మస్కట్ లోని బర్క సెవెన్ బలదీయా క్యాంపులో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక బర్క ఇంచార్జ్ అయిన శ్రీ దిలీప్ కుమార్ మరియు మహేశ్వర్ ( పట్వారీ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి జిల్లాల గల్ఫ్ సోదరులు పాల్గోనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఒమాన్& మస్కట్ ఉపాధ్యక్షులు గుంటుక శ్రీనివాస్ సెక్రెటరీ & మబేలా ఇంచార్జ్ కొత్త చిన్నయ్య,మిస్వ కో ఆర్డినేటర్ కొల్లపురం రాములు హాజరైనారు, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వారి ఆధ్వర్యంలో చేపట్టిన గల్ఫ్ కార్మికుల మహా సభకు మద్దతుగా నిరసన తెలుపడం జరిగింది,అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఏ విధంగా అయితే గల్ఫ్ కార్మికులకు 500/- కోట్లు కేటాయించి కేరళ తరహాలో ఎన్ ఆర్ ఐ పాలసీ అమలు చేసి గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కుటుంబాలకు 10లక్షల ఏక్షగ్రేషియా ఇచ్చి ప్రభుత్వం అదుకునేలా ఏజెంట్ల మోసాలకు గురైనా బాధితులను, గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన వృద్దులను ఆదుకుంటామని హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేసి మాట నిలుపుకోవాలని ఒమాన్ మస్కట్ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యడం జరిగింది గల్ఫ్ కార్మికుల మహా సభను విజయవంతం చేయాలని ప్రతి తెలంగాణ గల్ఫ్ బిడ్డలను, గల్ఫ్ బిడ్డలకుటుంబ సభ్యులను, గల్ఫ్ లో మృతి చెందిన మృతుల కుటుంబాలను, ఏజెంట్ల చేతిలో మోసానికి గురైనా బాధితులను ఈ గల్ఫ్ కార్మికుల మహా సభకు అధిక సంఖ్యలో హజరై సభను విజయవంతం చేయవలసిందిగా ఒమాన్ మస్కట్ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక శాఖ ద్వారా కోరారు అలాగే గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఒమాన్ మస్కట్ బర్క వారి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం నుండి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ధోనికేని కృష్ణ తో IMO లో వీడియో కాల్ మాట్లాడి ఎన్ఆర్ఐ పాలసీ వచ్చే వరకు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వారి ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఒమాన్ మస్కట్ శాఖ వారి పూర్తి సహాయ, సహాకారాలు అందిస్తామని హామీ ఇవ్వటం జరిగింది GWAC ఒమాన్&మస్కట్ కార్యవర్గం పాల్గొన్నారు
Post a Comment