కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేల్ది గ్రామ ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ సమావేశం తగరపు రవి అధ్యక్షత జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ హాజరై మాట్లాడారు CITU అనుబంధ సంఘం AIRTTWF అధ్వర్యంలో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. వెల్డి గ్రామ ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు వల్ల డ్రైవర్స్ హక్కుల కోసం, ప్రతీ సభ్యుడి ప్రతీ మంచి పని కి సీఐటీయూ జిల్లా నుండి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. డ్రైవర్స్లకు భవన నిర్మాణ కార్మికుల వలె సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే వరకు భాగ స్వామ్యం కావాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంనీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు తగారపు రవి, ప్రధాన కార్యదర్శి సందీప్,నాయకులు పోచంపల్లి శ్రీనివాస్, శ్రవణ్, రుద్రవరం బాబు, కొమరయ్య,మధుకర్,సురేష్, ఎడ్ల వేణు తదితరుల పాల్గొన్నారు
Post a Comment