వి ఎస్ యు లో 45 రోజుల నైపుణ్యాభి వృద్ధి శిక్షణా కార్యక్రమం ప్రారంభము

 


నెల్లూరు జిల్లా :కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో , ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభి వృద్ధి సంస్థ మరియు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సంయుక్తముగా 45 రోజుల నైపుణ్యాభి వృద్ధి శిక్షణా తరగతుల కార్యక్రమంను, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు అధ్యక్షత వహించగా ,  ఉపకులపతి ఆచార్య యం చంద్రయ్య గారు పాల్గొని ప్రసంగించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల దీప ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ  సందర్భముగా ఉపకులపతి ఆచార్య చంద్రయ్య గారు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతుల వలన విద్యార్థులకు ఎన్ని ఉపాదిఅవకాశాలు వస్తాయని, కాబట్టి అందరు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్య తిధి డా. ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ  ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు  నైపుణ్యాభి వృద్ధి శిక్షణా కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో చేపడుతున్నారని తెలిపారు. దీనికోసం నైపుణ్యాభి వృద్ధి విశ్వవిద్యాలయంను ప్రారంభిస్తున్నారని, రాబోవు రోజులలో  నైపుణ్యాభి వృద్ధికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోనుంది అని అన్నారు. ప్రాంతీయంగా నెలకొని వున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా , శిక్షణా తరగతుల ప్రణాళిక రూపొందించటం జరిగిందని కనుక ప్రతి విద్యార్థి శ్రద్ధతో  ఈ శిక్షణా తరగతులలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  ఎపి నైపుణ్యాభి వృద్ధి సంస్థ  జిల్లా అధికారి షైక్  అబ్దుల్  ఖయ్యుమ్, నైపుణ్యాభి వృద్ధి శిక్షణా సమన్వయకర్త  డా. సి ఎచ్ విజయ మరియు కో కన్వీనర్ డా. కె. విద్యా ప్రభాకర్, అధ్యాపక  మరియు అధ్యాపకేతర మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post