కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్ లో 30 మంది యువకులు BSP మండల కన్వీనర్ బెజ్జంకి చందు ఆద్వర్యం లో పార్టీ లో చేరారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ నిషాని రామచంద్రం ముఖ్య అథిది గా హజరయ్యి సిద్ధాంతం బోదించి వారికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన మహానీయులైన మహాత్మా ఫూలే- సాహూమహరాజ్- అంబేద్కర్ లు సాగించిన సామాజిక పరివర్తన ఉద్యమాన్ని మాన్యవర్ కాన్షీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ముందుకు తీసుకపోయారు. నేడు మనకు జాతీయ పార్టీ ని అందించారు. ఈ దేశం లో నూటికి 85% ఉన్న ప్రజలను రాజకీయ అధికారం కు దూరం పెట్టినాయి కాంగ్రేస్, బిజెపి పార్టీలు . ఒక్క BSP మాత్రమే రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న బహుజన సమాజానికి రాజకీయ అధికారం అందించేందుకే BSP ని స్థాపించారన్నారు బహుజన సిద్ధాంతం ను గ్రామ గ్రామాన బోధించి, ప్రజలను చైతన్య పరిచి మహనీయుల మార్గం లో నడిచి అమ్ముడుపోని సమాజం ను తయారు చేయాలని అన్నారు. బిజేపి టిఆర్ఎస్ పార్టీలు ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయి అన్నారు కేంద్రం లో BJP రాజ్యాంగం ను మార్చే కుట్ర చేస్తుంది అన్నారు . దేశ వ్యాపితంగా సివిల్ వార్ ని నిర్మించాలని అన్నారు . రాజ్యాంగం ను రక్షించుకోకపోతే మనం శాశ్వత బానిసలం అవుతామని అన్నారు . రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్షం గా పనిచేయాలని అన్నారు. అందుకే పార్టీ ని బూత్ స్థాయి నుండి నిర్మాణం లో బాగంగా బూత్ కమిటీ లు వేస్తున్నామని అన్నారు . బూత్ కన్వీనర్ల ను నియమించామన అన్నారు
ఈ కార్యక్రమం లో నియోజకవర్గ అధ్యక్షులు సంగుపట్ల మళ్లేషం , మాతంగి వేణు, మాతంగి రాము, మాతంగి భాస్కర్, కొంకటి అంజలి కుమార్ , చింతిరెడ్డి సుమన్, సుభాష్ రెడ్డి లు తదితరులు పల్గొన్నారు
Post a Comment