- టీఆర్ఎస్ దౌర్జన్యాలపై పోరాటం చేస్తాం
- బిజెపి మానకొండూర్ ఇంచార్జి గడ్డం నాగరాజు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్:కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అహర్నిశలు కేంద్ర ప్రభుత్వం కృషి కరోనా వ్యాక్సిన్ తయారుచేయించి ప్రజలకు అందుబాటులోకి తెస్తే మోడీ టీకా అని పెట్టుకొండని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెటకారంగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్లేనని బిజెపి మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జి గడ్డం నాగరాజు పేర్కొన్నారు. తిమ్మాపూర్ పీహెచ్ సీ లో శుక్రవారం కరోనా వ్యాక్సిన్ ప్రారంభం సందర్బంగా అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో తిమ్మాపూర్ బిజెపి నాయకులు అధికారులను ప్రశ్నించారు దీంతో సమాధానం చెప్పలేక స్థానిక వైద్యాధికారులు తడబాటుకు గురికావడంతో టెంట్ కింద బైటయించిన బిజెపి నాయకులు అధికారుల నిర్లక్ష్య ధోరణి నశించాలని నిరసన తెలిపారు.సుమారు గంటపాటు బిజెపి నాయకులు అక్కడే ఉండటంతో పోలీసులు చేరుకొని బందోబస్తు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రసమయి మోదీ పెట్టాలని ఎక్కడైనా ఉందా అంటూ అక్కసం వెళ్ళగక్కారు. ప్రతీ పనికి బిజెపి నాయకులు అడ్డుపడుడెందని అన్నారు. వ్యాక్సిన్ ను మోదీ పంపిస్తే మోడీ టీకా అని పెట్టుకోకపోయినారు అని మాట్లాడటం పై గడ్డం నాగరాజు తో వాగ్వాదానికి దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు నిరసన జరగడంతో అక్కడికి వచ్చిన ఉన్నతస్థాయి అధికారులు మిన్నకుండిపోయి సమాధానం చెప్పలేక వెళ్లిపోయారు. పట్టువదలకుండా బిజెపి నాయకులు అక్కడే ఉండటంతో చివరికి స్థానిక మెడికల్ ఆఫీసర్ వచ్చి ఈ కార్యక్రమం అంతా పై అధికారుల సూచనల మేరకు చేశామని దీనిపై మమ్మల్ని భాద్యులను చేయవద్దని ప్రాదేయపడటంతో బిజెపి నాయకులు నిరసనను విరమించారు.ఫ్లెక్సీ నీ చింపెందుకు ప్రయత్నం చేయగా సీఐ మహేష్ గౌడ్ అడ్డుకొని వారిని అక్కడినుంచి పంపించివేశారు.అనంతరం మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి క్షేరాభిషేకం చేసి కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రసమయి చేస్తున్న దౌర్జన్యాలపై బిజెపి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేస్తామని గడ్డం నాగరాజు అన్నారు.బెజ్జంకి మండలంలో రైతుల పొలాలనుండి అక్రమంగా కాలువలు తృవ్వి తన చాపల చెరువుకు నీళ్లను మల్లిస్తున్నాడని తెలిపారు. ఎవరైనా రైతులు కెనాల్ తెంపితే కేసులు పెట్టె పోలీసులు ఎమ్మెల్యే పై కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులతో స్వంత పనులు చేయించుకుంటున్న ఎమ్మెల్యే ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నాదని ఆరోపించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, సీనియర్ నాయకులు వేల్పుల రవీందర్ యాదవ్,ప్రధాన కార్యదర్శి కిన్నెర అనీల్,బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, జిల్లా ఈసీ మెంబర్ బండి సాగర్,కార్యదర్శి దుండే వీరశేఖర్,మాదన మహేష్ చంద్ర,బొడ్డు అశోక్,రేగుల శ్రీనివాస్,వేల్పుల రమేష్, పైడిపల్లి సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment