రైతుల సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వం కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన ఉభయ సభలనుద్దేశించి మాట్లాడుతూ.. కొత్త సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయని తెలిపారు.విస్తృత చర్చల అనంతరం కొత్త చట్టాలు పార్లమెంట్లో ఆమోదం పొందాయని కోవింద్ తెలిపారు. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను పెంచుతోందని చెప్పారు. అలాగే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. కాగా, గత ఏడాది కరోనాయే కాకుండా తుపాన్ల నుంచి బర్డ్‌ఫ్లూ వరకు దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని రాష్ట్రపతి కోవింద్ తెలిపారు. ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొందని చెప్పారు. కరోనా వైరస్ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుందని, ఎందరో మహనీయుల ప్రాణాలు తీసిందని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలు కరోనాతో మరణించారని అన్నారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో కొత్త పార్లమెంట్ నిర్మాణం జరుగుతుండడం సంతోషకరమని తెలిపారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వరకూ ఆప్టికల్ ఫైబర్ ద్వారా అంతర్జాల సేవలు అందుతున్నాయని చెప్పారు. నగరాల్లో పేదల కోసం 40 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. దేశంలో కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్నట్లు కోవింద్ గుర్తు చేశారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే, దేశంలో మత్స్యకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ.20 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
దమ్మున్న జర్నలిస్టులకు మాత్రమే ఆహ్వానం 💐
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ
💐 రాష్ట్ర అధ్యక్షులు ,జిల్లా అధ్యక్షుల పదవికి ఆహ్వానం 💐
NOMINATIONS FOR 2021 TO 2023
AP AND TELANGANA
STATE AND DIST COMMITTEE NOMINATIONS
డైనమిక్ లీడర్ తో కలిసి
నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా ?
మీ దమ్ము అన్నది మీ వార్తలో చూపించండి.
మీ దగ్గర ఉన్న ఎన్నో ఇల్లిగల్ పనులు జరుగుతున్నాయి.
వాటిని భయటపెట్టండి.
రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండకుండా
ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి.
మీ ప్రతాపాలు తోటి రిపోర్టర్స్ పైన కాకుండా అవినీతి పైన చూపించండి.
మనలో మనకు ఐక్యత లేకనే రిపోర్టర్ అంటే సాయంత్రం ఇంత తాగిస్తే సరిపోతుంది.. ఎం చెప్పినా వింటాడు..
బ్లాక్ మెయిల్ చేస్తాడు.. ప్రజలను మోసం చేస్తాడు
అనే నిందను దూరం చేయండి.
అక్రిడిటేషన్స్ ఉన్నా లేకపోయినా పెట్టే వార్తలో దమ్ము ఉండాలి.
అలాంటి దమ్మున్న నాయకుడితో
కలసి అడుగులు వేయాలనుకుంటే
PRINT & ELECTEONIC MEDIA REPORTERS ASSOCIATION - INDIA
లో సభ్యత్వం పొందండి.
రాష్ట్ర నాయకులుగా
జిల్లా నాయకులుగా
మండల నాయకులుగా ఎదగండి
నలుగురికి
మార్గం చూపండి ....
Regards ,
PA to National President
Mob: +91 9492328119
Email:pemraindia@gmail.com
Web: www.penta india.org
Fb: https://www.facebook.com/pemraindia
Youtube: pemraindia
Twitter: https://twitter.com/Sudhakarpress
Post a Comment