జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

 


మహాత్మా గాంధీ 73వ వర్ధంతి  పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ దేశ ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసి దేశ ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందించినటువంటి మహాత్ముడు ఈ రోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం మతవాదుల తుపాకీ గుళ్ళకు బలై పోయి ప్రాణాలు అర్పించడం జరిగింది, మహాత్మా గాంధీ ప్రాణాలను తీసిన గాడ్సే ను ఆరాధించే పార్టీ బిజెపి పార్టీ,  నేడు మహాత్మాగాంధీజీ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు మరొకసారి ఆలోచించాలి ఈ మత వాదులను అందం అంతమొందించిన రోజునే మహాత్మాగాంధీకి నిజమైన నివాళి అర్పించినట్లు అని మతం ముసుగులో వస్తున్న బిజెపి పార్టీ వీర సావర్కర్ పేరు చెప్పుకుంటూ గాడ్సే ను ఆరాధిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా ఇదంతా ప్రచారం చేస్తున్నారు, మహాత్మా గాంధీని చంపిన వారిని తమ నాయకులు గా చెప్పుకుంటున్న వారు బిజెపి లో ఉన్నారు. అలాంటి వారిని ఈ దేశం నుండి తరిమి కొట్టిన రోజునే గాంధీజీకి ఘన నివాళి అర్పించి నట్లు అని ఈ సందర్భంగా దేశ ప్రజలను వేడుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు ఉప్పరి రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, లీగల్ సెల్ అధ్యక్షులు గ్రూపు రెడ్డి దేవేందర్ రెడ్డి, నాయకులు గుండేటి శ్రీనివాస్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి ఇర్ఫాన్, ఎండి సలీం ఉద్దీన్, బొబ్బిలి విక్టర్, కొమ్ము సునీల్, లయీక్, కాడే శంకర్, శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post