టిఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి - బిజెపి లక్ష్యంగా పసలేని ఆరోపణలు విమర్శలా..?



 కరీంనగర్ జిల్లా : ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని విస్మరించి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం నేడు బీజేపీ లక్ష్యంగా చిల్లర రాజకీయాలకు దిగజారడం సిగ్గుచేటని వాటిని మానుకోవాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల  కళ్యాణ్ చంద్ర అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీకి  అన్ని వర్గాల ప్రజల నుండి ఆదరణ చూసి ఓర్వలేక బిజెపి లక్ష్యంగా పసలేని ఆరోపణలు విమర్శలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ,వారి సమస్యలను విస్మరించి నేడు బిజెపి  లక్ష్యంగా  దిగజారుడు రాజకీయాలకు టిఆర్ఎస్ పార్టీ పాల్పడుతోందని ఆయన ఆరోపించారు . టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు రాముడు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హిందూ ప్రజల మనోభావాలను  దెబ్బ  తీసి ,బిజెపి లక్ష్యంగా విమర్శలు గుప్పించి   అనవసర ఆరోపణలు చేశారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆ పార్టీ నేత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి  అయోధ్య రాముడు పై మరిన్ని అనవసర వ్యాఖ్యలు చేసి బిజెపి లక్ష్యంగా  చిల్లర వ్యాఖ్యలు చేస్తూ  దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని తెలిపారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సోయి లేకుండా  మాట్లాడుతూ దైవ సంబంధమైన కార్యక్రమానికి  రాజకీయాలు ముడిపెట్టి లబ్ధి పొందాలనుకునే చిల్లర రాజకీయానికి శ్రీకారం చుట్టి అనవసర వ్యాఖ్యలతో ప్రజల ఆగ్రహానికి   గురవుతున్నారని  పేర్కొన్నారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కరీంనగర్ లో కొత్త నాటకానికి ,చిల్లర రాజకీయానికి  శ్రీకారం చుట్టిందని వివరించారు. తెలంగాణ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు  సభ్యులుబండి సంజయ్ కుమార్ లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ పనికిమాలిన ఆరోపణలు చేస్తూ ఆదివారం రోజున బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పాల్పడిందన్నారు.బండి సంజయ్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడం టిఆర్ఎస్ పార్టీ గురించి  మాట్లాడడం తప్పు విధంగా  అనే బండి సంజయ్ పై టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తూ నిరసన కార్యక్రమాలకు దిగడం సిగ్గుచేటన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోనే లోగడ  దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో పరాజయం పాలై ఆ ఎన్నికల్లో  ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటి తీర్పు ప్రజలు ఇచ్చిన టిఆర్ఎస్ తన పద్ధతులను మార్చుకోక పోవడం శోచనీయం అన్నారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పని చేయాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలే లక్ష్యంగా నేడు చిల్లర రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.టిఆర్ఎస్ ప్రభుత్వం  ఒంటెద్దు పోకడలతో నియంత పరిపాలన తో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తు, తన వ్యవహారశైలిని మార్చుకోకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న బిజెపి పార్టీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్  బండి సంజయ్ కుమార్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తూ టిఆర్ఎస్  పార్టీ నాయకులతో కరీంనగర్లో నిరసన చేపట్టడం  ఏమిటని ఆయన ప్రశ్నించారు.? బండి  సంజయ్ కుమార్ కి తెలంగాణ ప్రజల అభివృద్ధి,సంక్షేమంపై చిత్తశుద్ధి ఉండబట్టే అనేక పోరాటాలు చేస్తున్నారని , ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారని, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పార్లమెంటు సభ్యులుగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని టిఆర్ఎస్ పార్టీకి ఎంపీ  బండి సంజయ్ కుమార్ ను విమర్శించే అర్హత లేదన్నారు. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చి, చిన్న జిల్లాగా  మార్చింది తప్ప, కరీంనగర్ జిల్లాకు చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు.  కరీంనగర్లో స్థానికంగా ఉంటున్న మంత్రి ముందుగా కరీంనగర్ కు ఏం  చేసింది ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రిగా ఉండి కరీంనగర్ కు ఏమీ చేయలేక ఆ పార్టీ నాయకులను రెచ్చగొట్టి ఎంపీ బండి సంజయ్ కుమార్పై నిరసన  కార్యక్రమాలు చేపట్టడం  దిగజారుడు  రాజకీయాలకు నిదర్శనమన్నారు. కరీంనగర్ అభివృద్ధి పై టిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేసి చూపించాలని, జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇకనైనా తమ వ్యవహారశైలిని మార్చుకుని ప్రజల సంక్షేమo, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ కోసం కాకుండా, ప్రజల కోసం పోరాటం  చేస్తే హర్షి స్తారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ పద్ధతులను మార్చుకొని చిల్లర రాజకీయాలకు స్వస్తి చెబితే మంచిదని లేకపోతే రాబోయే కాలంలో  ప్రజలే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు

0/Post a Comment/Comments

Previous Post Next Post