గన్నేరువరం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ను సీజ్ చేసిన అధికారులు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఆయుర్వేద ఆసుపత్రిలో గత నెల రోజుల నుంచి వైద్యుడు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో స్థానికులు  నానా ఇబ్బందులు పడ్డారు. అను నిత్యం అందుబాటులో ఉండాల్సిన వైద్యుడు వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న వైద్యుడి పై చర్యలు తీసుకోవాలని స్థానికులు పలుమార్లు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రవి నాయక్ ఆసుపత్రిలో మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తాళానికే పరిమితమైన ఆసుపత్రిని తెరిచి చూడగా దుమ్ము ధూళి చేరి అసభ్య కరంగా మారింది. సంబంధిత రికార్డులు పరిశీలించడంతో చాలా రోజుల నుంచి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజర్ కావడంతో డాక్టర్ భవాని ప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు డాక్టర్ సరళిపై నోటీసులు జారీ చేస్తూ కన్వీనర్ కు అందజేస్తామన్నారు. అనంతరం ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో గన్నేరువరం కారోబార్ జువ్వాడి మాధవరావు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post