నెల్లూరు జిల్లా :విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జాతిపిత "మహాత్మాగాంధీ" వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి..పూలమాలవేసి రెక్టర్ ఆచార్య. ఎం చంద్రయ్య గారు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ క్రిష్ణ రెడ్డి గారు, నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ..అందరూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు,రిజిస్ట్రార్ ఎల్ విజయక్రిష్ణ రెడ్డి గారు,కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సుజ ఎస్ నాయర్ గారు, మరియు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి గారు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాయ్ గారు, పి ఆర్ ఓ నీలమణీ కంట గారు, మరియు బోధ, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment