అమ్మఒడి రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్


 

సీఎం జగన్ ఇవాళ అమ్మఒడి పథకం రెండో విడత నిధుల చెల్లింపులను లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆలయాలపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన స్పందించారు. విగ్రహాలను ఎవరు ధ్వంసం చేయిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి... ధ్వంసమైన విగ్రహాలు చూస్తామని ఎందుకు వెళుతున్నారో అర్థం చేసుకోండి అని వ్యాఖ్యానించారు. రథాలు ఎందుకు తగులబెడుతున్నారో, ఆ తర్వాత రథయాత్ర ఎందుకు చేయబోతున్నారో గమనించండి అని పేర్కొన్నారు. "ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టే ముందో, తర్వాతో ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు. మనం చేసిన మంచి ప్రపంచానికి తెలియొద్దనే దాడులు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోరాటం చేస్తున్నాం. అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసినవాళ్లు కొత్తవేషం కడుతున్నారు. హైదరాబాదులో కూర్చుని చంద్రబాబు, ఆయన కొడుకు కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి" అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.

Post a Comment

Previous Post Next Post