కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెళ్ల గ్రామంలో KDCC బ్యాంకు ఆధ్వర్యంలో రైతుసోదరులకు, ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుస్తులాపూర్ PACS చైర్మన్ అలువాల కోటి పాల్గొని KDCC BANK కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా సేవలు అందిస్తున్నవని, రైతు సోదరులకు పంట రుణాలు, దీర్ఘకాలిక మార్ట్ గేజ్ రుణాలు, బంగారం పైన, ఉన్నత విద్య పైన, గృహ నిర్మాణం పైన మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సబ్సిడీ రుణాలు కూడా రైతు సోదరులకు అందిస్తారని తెలియజేశారు కావున ప్రజలందరూ KDCC BANK సేవలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం కేడీసీసీ బ్యాంకు మేనేజర్ ప్రవీణ్, పిఎస్ఎస్ డైరెక్టర్ బద్దం రామ్ రెడ్డి, FLC వెంకటేష్ , మాజీ సర్పంచ్ సంగు దేవయ్య , పాలకేంద్రం చైర్మన్ చెక్కిళ్ళ చంద్రయ్య ,వార్డు సభ్యులు యల్లా రామ్ రెడ్డి,చెక్కిళ్ళ తిరుపతి , మరియు బ్యాంకు సిబ్బంది గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు .
Post a Comment