మళ్లీ దొరికిన గంజాయి...భద్రాచలం పట్టణంలో విస్తృత తనికీలు

 


భద్రాచలం ఎఎస్పీ డాక్టర్ వినిత్ తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 14 సోమవారం   ఉదయం ఏడు గంటలకు భద్రాచలంలోని అంబెడ్కర్ సెంటర్ వద్ద పట్టణ సిఐ స్వామి ఆద్వర్యంలో, ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా AP24 TA7869 అనే నెంబర్ గల తుఫాన్ వాహనంను ఆపి తనిఖీ చేయగా అందులో  ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించినట్లు తనిఖీల్లో తుఫాన్  నందు 105  కేజీల గంజాయి  లభ్యమైనట్లు దీని విలువ షుమారు 15,75,000/- రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు.  ఇందులో ఉన్న వ్యక్తిని విచారించగా తన పేరు ఎడవెల్లి సురేష్, సూర్యాపేట అని ఈ గంజాయిని సీలేరు నుండి హైదరాబాదుకు తరలిస్తున్నానని చెప్పినట్లు ఎఎస్పీ తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు సిబ్బందితో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా TS12UC0554 అనే నెంబర్ గల DCM వాహనంను ఆపి తనిఖీ చేయగా అందులో  ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించనట్లు, వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 1151  కేజీల గంజాయి  లభ్యమవగా గంజాయి విలువ షుమారు 1,72,74,000/- రూపాయలు ఉంటుందని, ఇందులో ఉన్న వ్యక్తులను విచారించగా వారి  పేర్లు 

1. మహ్మద్ అబ్దుల్ సాజిద్, చేవెళ్ల 

2. మహ్మద్ ఫజల్ నవాబ్, హైదరాబాద్

అని ఈ గంజాయిని దారకొండ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులు తెలిపనట్టు  డాక్టర్ వినిత్ తెలిపారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో  24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి,  మరే ఇతర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ CI స్వామి,SI మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post