కరీంనగర్ జిల్లా :గీతా జయంతి ని పురస్కరించుకొని ఈ నెల డిసెంబర్ 25 తేదీన జరగబోయే కార్యక్రమంలో భగవద్గీత పాఠకులు మరియు భక్తమహాశయులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవద్గీత ప్రాశస్త్యాన్ని ప్రతీ ఒక్కరికీ తెలపాలని గీతాజయంతి కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.విశ్వశాంతి-కరోనా కట్టడి కోసం సంస్కృత భారతి-ఆలయ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో విశ్వగీత-శ్రీమద్భాగవద్గీత సంపూర్ణ భగవద్గీత పారాయణం లో భాగంగా శనివారం కరీంనగర్ జిల్లా పరిధిలోని తిమ్మాపూర్, మానకొండూర్,శంకరపట్నం మండలాల్లోని ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులకు కార్యక్రమ నిర్వాహకులు ఆదివారం రామక్రిష్ణకాలనీలో పలువురికి భగవద్గీత గ్రంథాలను అందించారు.ఈ సందర్బంగా ఆలయ ఫౌండేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధులు తీట్ల రమేష్, మిట్టపల్లి రాజేందర్ మాట్లాడుతూ ఫౌండేషన్ మార్గదర్శకులు,బసంత్ నగర్ నివాసి మధ్యప్రదేశ్ ఐఅండ్ పీఅర్ కమీషనర్ పరికిపండ్ల నరహరి గారు సూచించిన మేరకు ఎక్కువ సంఖ్యలో కేంద్రాల్లో గీతాజయంతి కార్యక్రమంను విజయవంతం చేయాలని సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు.గ్రామాల్లోని దేవాలయాల్లోని మైక్ సెట్ ల ద్వారా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు గీతా పారాయణం జరిపించాలని కోరారు. భగవద్గీతను జాతీయ గ్రంథం గా పరిగణించాలనే డిమాండ్ తో విశ్వవ్యాప్త సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి,జలేందర్ రెడ్డి,సిరికొండ వెంకట్రావు,విజయేందర్ రెడ్డి, అలువాల సంపత్, సుగుర్తి పరమేశ్వర చారి ఉన్నారు.
Post a Comment