ఎంపీ నందిగం సురేష్ రాజీనామా చేయాలి బిజెపి ఎస్సీ ఎస్టీ మోర్చా నాయకుల డిమాండ్


వెలగపూడి గ్రామంలో దళితుల మధ్య జరిగిన ఘర్షణలో  దళిత మహిళ మరియమ్మ మృతి పట్ల అరండల్ పేట లోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.బిజెపి నాయకులు పత్తిపాడు అసెంబ్లీ కన్వీనర్ దారా అంబేడ్కర్ మాట్లాడూతూ అన్నదమ్ముల వంటి దళితుల మధ్య చిచ్చు పెట్టి ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడిన వైకపా ఎంపీ నందిగం సురేష్ నైతిక భాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలన్నారు.ఎస్టీ మోర్చా ఫార్మర్ ఉపాధ్యక్షులు తిరువీధుల శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ తెదేపా వర్గీకరణతో  అనాడు చిచ్చు పెడితే ఇప్పుడు ఇదే సామాజిక వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకపా కూడా అన్నదమ్ముల వంటి సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టడం  సబబు కాదని తీవ్రంగా ఖండించారు.మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ బిజెపి ఫార్మర్ నాయకులు కొర్రపాటి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రాజధాని ఉద్యమం మరియు ఎస్సీ ఎస్టీల సమస్యలపై జరుగుతున్న ఉద్యమాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు వైకపా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా ఉందని దుర్ఘటనపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎంక్వైరీ వేసి ప్రజాప్రతినిధుల మీద కూడా కేసులు నమోదు చేసి భాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post