ఆర్మీ ట్రైనీ జవాన్ ఆత్మహత్య - కుటుంబాన్ని ఆదుకున్న జయహో జనతా జవాన్స్

 


కరీంనగర్  వట్టేమల : ఇటీవల వట్టేమల గ్రామానికి చెందిన బాలుసాని వెంకటేష్ కొత్తగా ఈ సంవత్సరం లో ఆర్మీ లో ఉద్యోగం పొంది ట్రైనింగ్ సమయం లో కాలికి గాయం అవడం వలన  మెడికల్ లీవ్  లో ఇంటికి వచ్చాడు .  ఆ గాయం పూర్తిగా నయం కాకుండా,ట్రైనింగ్ గురించి, ఆర్మీ లో ఎలా మళ్ళీ జాయిన్ అయ్యి ట్రైనింగ్ ఎలా పూర్తి చేయాలి అని మనస్థాపము చెంది కొద్ది రోజులు క్రితం ఇంట్లో ఎవరు లేని సమయం లో ఉరి వేసుకొని చనిపోయాడు . 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా  కి చెందిన జై యహో జనతా - జవాన్ సెర్వింగ్ సోల్జర్స్ లీవ్ లో ఉన్న వాళ్ళు అందరు కలిసి మృతుడు  వెంకటేష్  కుటుంబానికి  కి 40, 000 రూపాయలు  వేములవాడ  C.I నవీన్ కుమార్, వట్టే మల సర్పంచ్ యామ సుమతి తిరుపతి సమక్షంలో అందించారు. 

ఈ కార్యక్రమం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జయహో జనతా జవానులు విక్రమ్ -కొలిమికుంట, జితేందర్ - జమ్మికుంట, కిషోర్ - కోరుట్ల,శ్రవణ్ - కరీంనగర్,జెమినీ సతీష్ - చొప్పదండి, గంగయ్య - నర్సింగాపూర్,దేవేందర్ - కొలనూర్,దేవేందర్ - ఇల్లంతకుంట,నరేష్ - వేములవాడ,కర్ణాకర్ - వేములవాడ పాల్గొన్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post