గుంటూరు జిల్లాలోని నడికుడిలో ఉన్నట్టుండి అస్వస్థతకు గురవుతున్న ప్రజలు

 


ప . గోదావరి జిల్లా ఏలూరులో ఇటీవలే వందలాది మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోనూ కొందరు స్థానికులు అస్వస్థతకు గురవుతుండడం అలజడి రేపుతోంది. వరుసగా కొందరు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. నడికుడికి చెందిన పల్లపు రామకృష్ణ అనే యువకుడు స్పృహ తప్పి పడిపోవడంతో గుర్తించి కుటుంబ సభ్యులు ఆయనను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి బాగోలేకపోవడంతో  అనంతరం గుంటూరు వైద్యశాలకు తరలించారు. అనంతరం అదే గ్రామంలో మరో ఇద్దరు స్పృహ తప్పి పడిపోవడంకలకలం రేపుతోంది. అక్కడ ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగానే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారంటూ ఆ గ్రామస్థులు అంటున్నారు. కాగా,  నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం వెలుగొట్టపల్లిలోనూ ఆరుగురు రైతు కూలీలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.  వారిలో ఒకరు నిన్న ప్రాణాలు కోల్పోయారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post