నెల్లూరు జిల్లా:విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం :అమరజీవి పొట్టి శ్రీరాములు 68 వ వర్ధంతిని పురస్కరించుకొని , ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం విక్రమ సింహపురి విశ్వవిద్గ్యాలయం లో ఘన నివాళులు అర్పించారు. ఈ . సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు, రెక్టార్ ఆచార్య యం చంద్రయ్య గారు, రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినారు .. అయన ఈ జిల్లా వాసి అవటం మనమందరము గర్వించ తగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్ డిప్యూటీ రిజిస్ట్రార్ డా. సాయిప్రసాద్ రెడ్డి , అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Post a Comment