జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఓ మీడియా చానల్ పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోను భరత్ కుమార్ తదితరులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పార్థసారథిని కలిశారు. రాజ్ న్యూస్ చానల్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాలు ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఆ చానల్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రతినిధులు ఎస్ఈసీని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాజ్ న్యూస్ చానల్ సీఎం కేసీఆర్ పైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా, టీఆర్ఎస్ పార్టీపైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ఆరోపించారు.
Post a Comment