ఏం చెప్పామో అదే చేసాం - రాష్ట్రం లో జరిగిన అభివృద్ధి నమ్మాల్సిందే: కేటీఆర్

 


జిహెచ్ఎంసీ  ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు నమ్మాలని తెలిపారు. తాము ఏం చెప్పామో అదే చేశామని, తాము చేయగలిగిందే చెబుతామని స్పష్టం చేశారు. తాము బాధ్యతాయుతమైన హామీలనే చేస్తామని వెల్లడించారు. తాము చేసిన అభివృద్ధి కళ్లముందే ఉందని, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. హైదరాబాద్ పౌరుడ్ని అయినందుకు గర్విస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. డిసెంబరు 1న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ ఓటు ద్వారా అభివృద్ధిని ఎంచుకోవాలని, విభజన శక్తులను దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post