ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు హామీ నెరవేర్చాలని టిఎన్ఎస్ఎఫ్ ధర్నా


 

కరీంనగర్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే  ప్రభుత్వ ఆసుపత్రిని నీమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గా కరీంనగర్ కు వచ్చిన కేసీఆర్ ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తానని, ప్రభుత్వ ఆసుపత్రి ని నిమ్స్ తరహాలో ఆధునీకీ కరణ చేస్తానని హామీ ఇచ్చి ఏడేళ్లు కావస్తు న్నా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అదే విధంగా ఉద్యమ సమయంలో  తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రాజీనామా చేసిన ప్రతిసారి ఇదే కరీంనగర్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే కరీంనగర్ ప్రజలు చేసిన పాపమా అని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి నలుగురు మంత్రులు ఉన్నా కరీంనగర్ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల తీసుకు రావడంలో పూర్తి వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన రెండు ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయనని ప్రభుత్వపరంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే  వాటికి నష్టం వాటిల్లిందనే కారణతోనే కేసీఆర్ ఇచ్చిన హామీని నిలుపుకోవడం లేదని విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగివచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల హామీని వెంటనే ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో  ప్రగతి భవన్ ముట్టడి ఇస్తామని హెచ్చరించారు అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్యామ్ లాల్ ప్రసాద్ గారికి మెమొ రాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మోతె రాజు,తెలుగు యువత రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రొడ్డ శ్రీధర్, కార్య దర్శులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, బత్తిని సతీష్, టీఎస్ఎన్వీ పార్లమెంట్ అధ్యక్షుడు, ఎర్రవెల్లి రవీందర్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు భాను, ప్రదీప్, వాజిద్, శశికుమార్,పర్శరాములు,వంశీ,అంజి,వినీత్ తదితరులు పాల్గొన్నారు



0/Post a Comment/Comments

Previous Post Next Post