బతుకమ్మ పండుగ - దసరా పండుగ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల పై ఎస్సై ఆవుల తిరుపతి సమావేశం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో మంగళవారం దుర్గామాత విగ్రహాలు పెట్టిన వారిని పిలిపించి దుర్గామాత మండపాల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన కరోనా నియమాలు, మరియు బతుకమ్మ పండుగ, దసరా పండుగ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల పై ఎస్సై ఆవుల తిరుపతి సమావేశం ఏర్పాటు చేశారు 

తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు మాట్లాడుతూ

1. ప్రతీ దుర్గామాత మండపం దగ్గర కనీసం 5 గురు వాలంటీర్లు ఉండడాలి.

2. రోడ్ పైన విగ్రహాలు పెట్టిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

3. కరెంట్ వల్ల ప్రమాదాలు జరగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి. 

4. కరోనా నియమాలు తప్పకుండా పాటించవలెను.

5. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఊరేగింపులు చేయరాదు. 

6. DJ లు మరియు బ్యాండ్ వాడరాదు.

7. బతుకమ్మ ఆడే మహిళలు వారి ఆభరణాల పట్ల తగిన జాగ్రత్తలు పాటించాలి.

8. ఎవరైనా అనుమానాస్పదంగా కన్పించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అందరు భక్తి బావంతో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ జరుపుకోవాలని సూచించారు

0/Post a Comment/Comments

Previous Post Next Post