మన్యంలో ఎన్ కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుదవారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 21 నుండి 27 వరకు మావోయిస్టుల 16వ వార్షకోత్సవ వారోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కమిటీ తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి చాలా యాక్షన్ టీంలను, మావోయిస్టు దళాలను చత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు పంపించినట్లుగా పోలీసులకు అందిన  విశ్వసనీయ సమాచారంతో పాటు మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తులను ద్వంశం చేయటానికి, పోలీసులపై దాడి చేయడానికి వ్యూహరచన చేసుకున్నట్లు సమాచారం వచ్చిన నేపధ్యంలో  జిల్లాలోని చర్ల మరియు మణుగూరు అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం

అందిన నేపధ్యంలో బుదవారం సాయంత్రం కూంబింగ్ ఆపరేషన్ కి వెళ్ళిన జిల్లా పోలీస్ పార్టీలకు, మావోయిస్టులకు  బుదవారం రాత్రి సుమారు 7:00 గంటల సమయంలో  చెన్నాపురం అటవీ ప్రాంతంలోని గుట్టల వద్ద  ఎదురు కాల్పులు జరిగాయని, కాల్పుల జరిగిన అనంతరం  ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు ముగ్గురు మావోయిస్టుల మృతదేహలు లభించయని ఆయన తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు  మృతదేహాలు ఉన్నాయని, అంతే కాకుండా కాల్పులు జరిగిన ప్రదేశం నుండి ఒక 8mm రైఫిల్, బ్లాస్టింగ్ నకు ఉపయోగించే సామగ్రి, 01 కిట్ బ్యాగు మరియు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఎస్పీ తెలిపారు. సెప్టెంబర్ 27 వరకు జరగనున్న మావోయిస్టు  వారోత్సవాల నేపధ్యంలో పోలీసు బలగాలు జిల్లాలోని చర్ల, మణుగూరు మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని, మావోయిస్టులు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే ఉంటారని ఎస్పీ ప్రకటనలో తెలియజేశారు. కాగా మరణించిన   మావోయిస్టుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post