భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రాష్ట్ర రహదారి 12 ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం, చర్ల, భద్రాచలం ప్రధాన రహదారిలో మందుపాతరలను అమర్చిన మావోయిస్టులు. భద్రాచలం ఎఎస్పి రాజేష్ చంద్ర నేతృత్వంలో నిర్వీర్యం చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం.
కొద్ది రోజుల క్రితం గుండాల, చర్ల మండలాలలో జరిగిన వరుస ఎన్కౌంటర్ల నేపధ్యంలో ఈ బాంబుల ఘటన అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
చర్ల మండలం తేగడ, కలివేరు గ్రామాల మధ్య గల రహదారి పక్కన మావోయిస్టులు అమర్చిన సుమారు ఐదు నుండి ఆరు కేజీల బరువు గల మూడు ముందుపాతరలను శనివారం ఉదయం గుర్తించిన చర్ల పోలీసులు. మావోయిస్టులు ముందుపాతరలను అమర్చారు అని సమాచారం అందుకున్న పోలీసులు, భద్రాచలం ఎఎస్పి రాజేష్ చంద్ర నేతృత్వంలో జిల్లా బాంబ్ డిఫ్యూజ్ టీమ్, CRPF బృందం, జిల్లా అదనపు పోలీసుల సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టి మూడు మందుపాతరలను కలివేరు, రాజీవ్ నగర్ గ్రామాల మధ్య గల గుట్ట పక్కన నిర్వీర్యం చేశారు. ఈ మూడు మందుపాతరలలో రెండిటిని రైతులు, వ్యవసాయ కూలీలు విశ్రాంతి తీసుకునే చెట్టుకింద, మూడవది పంట పొలాల్లో అమర్చిన మావోలు. సంఘటనా స్థలంలో బాంబును పేల్చడానికి ఉపయోగించే బ్యాటరీలు, వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలివేరు తోగుల దగ్గర మిట్ట మధ్యాహ్నం వరుసగా బాంబుల మోత వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాంబుల కలకలం నేపథ్యంలో సుమారు నాలుగు గంటల పాటు స్తంభించిన రాకపోకలు. బాంబును నిర్వీర్యం చేసిన కార్యక్రమంలో ఎఎస్పి రాజేష్ చంద్రతో పాటుగా ఒఎస్ డి తిరుపతి, సిఐలు అశోక్ (ప్రస్తుత చర్ల సిఐ), సత్యనారాయణ (మాజీ చర్ల సిఐ), ఎస్ఐలు రాజు, స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్కా డ్, CRPF పోలీసులు పాల్గొన్నారు.
Post a Comment