భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం:భద్రాచలం పోలీసులకు మరోసారి చిక్కిన గంజాయి. మంగళవారం భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల సమయంలో అంబేద్కర్ సెంటర్ వద్ద పట్టణ ఎస్సై మహేష్ తమ సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా AP36S7677 అను నంబర్ గల వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అనుమానించ రీతిలో 11 సంచులు తారస పడ్డాయి. వాటిని తీసి చూడగా ప్రభుత్వ నిషేదిత గంజాయి అని గమనించి వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 11 సంచులలో గల గంజాయి 180.8 కేజీలు గాను దీని విలువ సుమారుగా 27,12,000/- రూపాయలుగా ఉంటుందని భద్రాచలం సిఐ వినోద్ వెల్లడించారు. పట్టుబడిన వ్యక్తులను విచారించగా
1. రాథోడ్ సతీష్. R/0 అశోక్ నగర్ కాలనీ,హైదరాబాద్.
2.దీపక్ రాజా రామ్ ధనగర్, R/0 మహారాష్ట్ర అని విచారణలో తేలిందని వెల్లడించారు.
నిషేధిత గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు గ్రామ శివారు నుండి రాష్ట్ర రాజధానికి తరలిస్తుండగా వీరిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో నిత్యం పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మరే ఇతర వస్తువులని తరలించినా వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భద్రాచలం ఎస్ ఐ బి.మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్ర నుండి భద్రాచలం మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధానికి జోరుగా గంజాయి రవాణా
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహ్దులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదవరి జిల్లా చింతూరు నుండి తెలంగాణ రాష్ట్ర రాజధానికి జోరుగా సాగుతున్న గంజాయి రవాణా. గడిచిన జూన్ 1 నుండి ఆగస్ట్ 14 వరకు సుమారుగా మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల (33000000) గంజాయి పట్టు కున్నారు. కాగా ఆగస్ట్ 18, ఆగస్ట్ 25 మరియు సెప్టెంబర్ 1 వ తేదీ ఈ మూడు రోజుల్లో సుమారు ఒక కోటి యాభై మూడు లక్షల అరవై ఏడు వేల రూపాయలు(15367000) విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. గడచిన మూడు నెలల్లో సుమారు 5 కోట్ల రూపాయలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొగ పోలీసుల కళ్లు గప్పి మోసుకెళ్ళిన గంజాయి విలువ ఎంత అనేది అంతు పట్టని విషయం. 7 లేదా 8 రోజులలో దొరికన గంజాయి రాష్ట్ర రాజధానికి చేరితే బరించలేని విషయం కాగా గత 3 నెలల కాల వ్యవధిలో తెలియకుండా ఎంత ఉంటుంది అది మత్తు మందుకు అలవాటు పడిన వారి చేతికి వస్టే పరిస్థితి ఏంటి అనేది మద్య తరగతి సామాన్య మానవుడుకి అంతు చిక్కని ప్రశ్న.
Post a Comment