కరోనా కాలంలో తొలి ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్ ... 12.30 గంటలకు నోటిఫికేషన్

 


దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ శాసనసభ ఎన్నికలకు బీహార్ సిద్ధమవుతోంది. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ గడువు నవంబరు 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సురక్షిత వాతావారణంలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. తక్కువ దశల్లోనే ఎన్నికలను ముగించాలని యోచిస్తోంది. కాగా, ప్రస్తుతం బీహార్‌లో జేడీయూ, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. మరోమారు అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉన్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఈసారి కూడా ఎన్‌డీఏ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలోకి నిలవనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆర్జేడీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి.


0/Post a Comment/Comments

Previous Post Next Post