ఇండియన్ నేవీ.. 10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 2021నోటిఫికేషన్ విడుదల

 


త్రివిధ దళాల్లో కీలకమైన ఇండియన్ నేవీ.. ఎగ్జిక్యూటీవ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పర్మనెంట్ కమిషన్(పీసీ)10+2 క్యాడెట్(బీటెక్) ఎంట్రీ స్కీమ్ కింద ఎజిమళ(కేరళ)లోని నేవల్ అకాడెమీ ఈ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో... జేఈఈ మెయిన్ రాసిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది.

Jobsవివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 34(ఎడ్యుకేషన్ బ్రాంచ్-05;ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్-29)

అర్హతలు: పీసీఎమ్(ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. అలాగే 10వ తరగతి లేదా 12వ తరగతి స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులను సాధించి ఉండాలి. దీంతోపాటు జేఈఈ మెయిన్ 2020కి హాజరై ఉండాలి.

వయసు: 2 జూలై 2001 నుంచి 01 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి. వయసు 17బీ నుంచి 19బీ సంవత్సరాల మధ్య ఉండాలి. ఎత్తు కనీసం 157 సెంటీమీటర్లు. నిబంధనలకు అనుగుణంగా దేహదారుఢ్య ప్రమాణాలను నిర్దేశిస్తారు.

ఎంపిక ప్రక్రియ: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. వీరికి బెంగళూర్/బోపాల్/కోల్‌కత్తా/విశాఖపట్నంల లో నవంబర్ నుంచి జనవరి మధ్య ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ రెండు దశల్లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి


దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 6, 2020.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2020.


పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: www.joinindiannavy.gov.in


0/Post a Comment/Comments

Previous Post Next Post