ఏర్పేడు మండలం , చింతలపాళెం పంచాయితీ , మరాఠీపురం గ్రామంలో నివసించే ఎస్టీ షికారులైన 112 కుటుంబాలకు 1971లో 560 ఎకరాల భూమిని పంచి పట్టాలు ఇచ్చింది. ఈ భూమిపై కన్నుపడి భూమిని ఎలాగైనా లాక్కోవాలని చింతలపాళెం అగ్రకులాల వారు చుట్టుప్రక్కల అగ్రకులాల వారిని కలుపుకొని 14సంవత్సరాల నుండి అనేక విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి చట్టప్రకారం మాదేనని మాకు అగ్రకులాల నుండి విముక్తి కల్పించoడి అని ఎస్టీలు 2014లో హైకోర్టులో కేసుకూడా వేసినారు. ఐనా అగ్రకులాల వారి ప్రయత్నాలు , దాడులు ఆగలేదు. 2017లో దాదాపు 200 మంది అగ్రకులాల వారు ఎస్టీ కాలనీపై దాడిచేస్తే 25 మందికి దెబ్బలు తగిలి ఏర్పేడు పోలీసు స్టేషన్లో కేసు పెట్టటం జరిగింది. ఎస్సీ ఎస్టీ చట్టప్రకారం కేసు కట్టినారు , పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహారించి అగ్రకులాల ముద్దాయిలను ఇప్పటికి అరెస్టు చేయకపోవడం వలన చట్టంపై గౌరవం , భయం లేని అగ్రకులాల వారు చట్టాన్ని వారి చుట్టంగా మలుచుకోని ఈ రోజు గిరిజన యువకుడిని హత్యచేసినారు. ఈ క్రమంలోనే ఎస్టీలు వారి భూమి హక్కుకోసం అమరావతిలో 2019లో ధర్నా చేసి CM జగన్ మోహన్ రెడ్డి ని , వివిధ అధికార్లును కలిసి న్యాయం చేయమని కోరటం జరిగింది , స్పందించిన ప్రభుత్వ అధికార యంత్రాంగం న్యాయప్రకారం ఈ భూమి ఎస్టీలదేనని ఎస్టీలకు అనుకూలంగా 13/1/2020 న చిత్తూరు కలెక్టరును ఆదేశించారు. ఈ ఆదేశాలను కలెక్టరు MROకి పంపించారు. కాని MRO అగ్రకులాలకు అనుకూలంగా వ్యవహారిస్తూ , ప్రభుత్వ ఆదేశాలను అమలుచేయకుండా ఇప్పటికి 8 నెలలు గడిసినా అగ్రకులాల వారికి నోటీసులు కూడా ఇవ్వకుండా ఈరోజు గిరిజన యువకుడైన చినబాబు హత్యకు పరోక్షంగా కారకులైనారు. ఐనా చట్టంపై నమ్మకంతో , మనోధైర్యoతో వారి భూమిపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అక్రమ బుద్దిగల , అక్రమ సంపాదనకు అలవాటు పడిన , నిజాయితీ లేని అగ్రకులాల వారు మరలా 9/8/2020 శనివారం దాదాపు 250 మంది అగ్రకులాల దుర్మార్గులు ఎస్టీలపై దాడి ప్రయత్నంలో భాగంగా చింతలపాళెం చెక్ పోస్టు వద్ద ఆటోలలో వస్తున్న ఎస్టీను ఆపి భయభ్రాంతుల్ని చేస్తూ దాడిచేసినారు. ఈ దాడిలో దాదాపు 23 మందికి దెబ్బలు తగిలి రక్తపు గాయాలతో పోలీసు స్టేషన్లో కేసు పెట్టినారు, ఎస్సీ ఎస్టీ కేసు కట్టిన పోలీసులు గిరిజనులు అనే లేక్కలేని తనం , పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహారించి , పరోక్షంగా ఈరోజు గిరిజన యువకుడైన చినబాబు హత్యకు కారణం . 9/8/2020 దాడిలో అగ్రకులాల వారు ఎస్టీను బెదిరింపు ఆదేశాలను జారీచేసినారు , 40 గంటలలోపు ఈ ఊరుని , ఈ భుమిని వదిలి వెళ్లాలి లెకపోతే మిమ్మల్ని చంపేస్తాము అన్నారు , అన్నవిధంగానే 40 గంటలకు ముందుగానే 11/8/2020 సాయంత్రం అతికిరాతకంగా ఎస్టీ షికారి గిరిజన డబ్బా.చినబాబును నరికి చంపడం జరిగింది. ఇటువంటివి పునరావృతం కాకుండా బాధితులకు అండగా నిలవాలని , ఐక్యత తో దళిత బహుజన సంఘాలు ముందుకు రావాలి బాధిత కుటుంబాలు కోరుతున్నాయి .
సమాచార సేకరణ :- డా.మేడికొoడ.ప్రసాదరావు
Post a Comment