విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ దత్తత గ్రామంలో కరోనా క్యాంపును చేపట్టిన విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం


 

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం దత్తత గ్రామమైన కాకుటూరులో తీవ్రవంగా ప్రబలుతున్న కరోనాను కట్టడి చేయటానికి ప్రత్యేక శిభిరాన్ని ఏర్పాటు చేసింది.

ఈ  కార్యక్రమంలో సమన్వయ కర్త డా.ఉదయ్ శంకర్ అల్లం ఆధ్వర్యంలో మరియు గ్రామ సచివాలయం సిబ్బంది సహకారంతో NSS వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి కరోనా రాకుండా ఉండటానికి తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తచర్యల గురించి అవగాహన కల్పించారు. అలాగే మినిస్ట్రీ అఫ్ ఆయుష్ వారి సిఫారస్సు చేసిన ఆర్సెనిక్ ఆల్బమ్ 30 హోమియోపతి మాత్రలను ఊరంతా పంచారు. తదనంతరం మురుగు కాల్వల వద్ద, మురుగు దొడ్ల వద్ద మరియు తేమగా వున్నా ప్రాంతములలో బ్లీచింగ్ పౌడర్ను చల్లి పారిశుధ్యపరచారు. ఈ సందర్భముగా సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే 30 కోవిడ్ కేసులు నమోదుకాగా 18 కేసులు యాక్టీవ్గా ఉన్నాయని, అందునిమ్మిత్తం కరోనా తీవ్రతరం కాకుండా తమవంతు బాధ్యతగా  విశ్వవిద్యాలయ ఉన్నతాధికారుల అనుమతితో ఈ క్యాంపు ను చేపట్టాం జరిగిందని తెలిపారు. జాతీయ సేవా పథకం (NSS) వాలంటీర్లు చేపట్టిన కార్యక్రమానికి గ్రామస్తులు సంతోషం వ్యక్త పరచి, కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ ది నీడి సభ్యులు, జాతీయ సేవా పథకం (NSS) మరియు యూత్ రెడ్ క్రాస్  వాలంటీర్లు, రాజేష్, అఖిల్, పవన్, వెంకట్, కావ్య, జ్యోత్స్న, కీర్తన, భారత్, జాతీయ సేవా పథకం (NSS) సెల్ సిబ్బంది ఉస్మాన్ అలీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కామేష్ మరియు ఇతర సచివాలయ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post