క్రైమ్ ని ప్రోత్సహిస్తున్న పంజాగుట్ట ఎసిపి తిరుపతన్న - చావాలా బాతకాల బాధితులు

 

రక్షణ కల్పించాల్సిన పోలీసులే క్రైమ్ ని ప్రోత్సహిస్తుంటే ఎవరి చెప్పుకోవాలి గోడు . బాధ్యత గలిగిన అధికారి పంజాగుట్ట ఏసిపి తిరుపతన్న సివిల్ విషయాలలో తలదూరుస్తూ .. అధికారం ఉందికదా అన్న అహంకారం తో కిందిస్థాయి పోలీసుల విధులకు అడ్డంపడుతూ... ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు .  వివరాల్లోకి వెళితే హైదరాబాద్ అమీర్పేట్  మధురానగర్ లో నివసిస్తున్న రెండుకు కుటుంబాల కనీటిగాధ . రమేష్ , ధర్మరాజు అనే ఇద్దరు వ్యక్తులు హెచ్ ఐ 1 లో చెరొక ఫ్లాట్ కొనుక్కొని నివాసం ఉంటున్నారు . అలాగే సత్యన్నారాయణ , నీరజ అనే దంపతులు అక్కడ నాలుగు ఫ్లాట్స్ కొనుక్కుని ... రమేష్ , ధర్మరాజులను ఇబ్బందులకు గురిచేస్తూ పంజాగుట్ట ఎసిపి తిరుపతన్న సహకారం తో  తరుచు వారి పై దాడులకు పాల్పడుతూ నరకయాతన చూపిస్తున్నారు . బాధితులు యస్ ఆర్ నగర్ పోలీసులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది . న్యాయం ఉన్నప్పటికీ న్యాయం చేయలేకపోయింది యస్ ఆర్ నగర్ పోలీస్ , బాధితులు పోలీసులను ఆశ్రయించిన ప్రతి సారి .. సత్యన్నారాయణ మీద కేస్ బుక్ చేయవద్దని గతంలో ఉన్న సిఐ పై ఎసిపి తిరుపతన్న  వత్తిడి చేసేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు . చిట్టచివరికి సి ఐ కి కోపం వచ్చి సత్యన్నారాయణ చేస్తున్నది తప్పని తెలిసి కేస్ బుక్ చేయడం జరిగింది . నూతనంగా బాధ్యతలు  సిఐ మురళీకృష్ణ చేపట్టిన రోజే మరల కొత్తపన్నాగం పన్నిన ఏసిపి మరలా కాలనిలో ఇంటిదగ్గర ఆపిన వాహనాలు ట్రోలింగ్ వాహనం ద్వారా తీసుకెళ్లడం బాధితుడైన ధర్మరాజును ఇబ్బంది పెట్టడం ప్రారంభమైంది . సత్యన్నారాయణ  పాత బస్తి నుండి రవిడీలను పిలిపించి రమేష్ భార్యను బెదిరించినట్టు  బాధితులు ఆరోపిస్తున్నారు . మేము బతకాలో చావాలో మాకు తెలియడం లేదు . సిపి గారు దయచేసి  ఆదుకోవాలని బాధితులు రమేష్ , ధర్మరాజు కోరుతున్నారు


0/Post a Comment/Comments

Previous Post Next Post