కావలి లో కరోనా కలకలం - రేపటి నుంచి 10 రోజుల లాక్ డౌన్


ఏపీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే సుమారు 2 లక్షల కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో సైతం కరోరా పంజా విసురుతోంది. జిల్లాలోని కావలిలో ఏకంగా ఏడుగురు వ్యాపారులు కరోనా కారణంగా మృతి చెందడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి వ్యాపార వర్గాలు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలంతా తమ వంతుగా లాక్ డౌన్ కు సహకరించాలని విన్నవించారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post