కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సాంబయ్యపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ మరియు కంపోస్టు షెడ్ పనులను పరిశీలించి మొక్కలు నాటిన ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, నుస్తులాపూర్ పిఎసిఎస్ చైర్మన్ అల్వాల కోటి ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భావితరానికి చక్కటి వాతావరణం అందించాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత మన అందరిపై ఉన్నది అని నేటి మొక్క రేపటికి మహా వృక్షం అవుతుందని, హరితహారంలో మనిషికి 5 మొక్కలు నాటుదాం రక్షిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం. నాటిన మొక్కలను బ్రతికించుకున్నప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మైలారం సర్పంచ్ రేణుక మల్లేశం పారువెళ్ళ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి రైతుబంధు జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి రవి టిఆర్ఎస్ నాయకులు బొడ్డు సునీల్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు అనిల్ మైలారం మాజీ సర్పంచ్ జక్కనపెళ్లి సత్తయ్య టిఆర్ఎస్ నాయకులు భగవాన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి బాపు రెడ్డి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Post a Comment