నిందితులను ఉరి తీయాలి


బాధిత కుటుంబాలను ఆదుకొని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తాం హైదరాబాద్ పట్టణంలోని ఎల్బీనగర్ లో  ముదిరాజ్ కులానికి చెందిన ఓ యువతిని అదే కాలనీలోని కొంతమంది ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి రోజులు గడుస్తున్నా విచారణ జరపగా పోవడం నిందితులను పట్టుకో కా పో వడం సిగ్గుచేటని ఇప్పటికైనా వెంటనే నిందితులను గుర్తించి వెంటనే ఉరితీయాలని అంబేద్కర్  పూలే మహాజన సంగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంతూరి  ఆంజనేయులు అన్నారు అత్యాచారం జరిగి హత్యకు గురైన బాధితురాలి సొంత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా ము టకొండూరు మండలం చాడా గ్రామం ని సందర్శించి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడవద్దని అంబేద్కర్ పూలే మహాజన సంగం తమకు అండగా ఉంటుందని నిందితులను పట్టుకొని ఉరి తీసే అంతవరకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణంలోని ఎల్ బి నగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే సదరు యువతి అదే ఆస్పత్రిలో పనిచేసే కొంతమంది అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని హత్యచేసి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విచారణ చేసి నిందితులను పట్టుకో కా పో వడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు  తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు రక్షణ కరువైందని అనడానికి ఇది చక్కటి ఉదాహరణ అని అన్నారు రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లోనే ఇలాంటి సంఘటనలు జరిగితే  ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ పట్టణం లో ఉండే  మహిళలకు రక్షణ కొరవడితే తెలంగాణలోని అన్ని జిల్లాలోని గ్రామాల్లో మహిళలకు ఏదైనా జరిగితే వారి పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకొని ఉరితీయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆయనతో పాటు హైదరాబాద్ జిల్లా కన్వీనర్ దుబ్బా దశరత్ గణేష్ శ్రీకాంత్ నాగరాజు కుటుంబ సభ్యులు పలువురు ఉన్నారు
Previous Post Next Post