తృటిలో తప్పించుకున్న మావోయిస్టు కొరియర్లు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్మగుడెం మండలం: దుమ్ముగూడెం మండల ఎస్ హెచ్ ఒ వెంకటేశ్వర్లు గారి ఆదేశాలపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో SI తిరుపతి గారు తన స్టేషన్ సిబ్బంది, 39-G కంపెనీ సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది తో కలిసి గుబ్బల మంగువాగు సమీపంలో పెద్ద బండ్రేవు క్రాస్ రోడ్ వద్ద ఆర్ & బి రోడ్డు మీద వాహన తనిఖీలు చేస్తుండగా  రెండు ద్విచక్ర వాహనాలలో నాలుగురు వ్యక్తులు భద్రాచలం  నుండి చర్ల వైపు గా వెళుతుండగా వారిని అపగా వారు ఆపకుండా వెళ్లిపోయారు.  వారిని వెంబడించగా ఒక ద్విచక్ర వాహనం లోని ఇద్దరు  దొరకకుండా వేళ్లిపోగా రెండవ ద్విచక్ర వాహనం వాళ్ళు వాహనాన్ని  వదిలేసి  పరిపోయారు. వదిలిన వాహనం రిజిస్ట్రేషన్  నెంబర్ AP20AK2860 గాను, అట్టి వాహనం ఆయిల్ ట్యాంక్ కవర్ నందు భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ వారిచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించమని ప్రజలను చైతన్య పరిచే విధంగా తెలుగులో వ్రాసి ఉన్న కర పత్రాలు-11,పెద్ద వాల్ పేపర్స్ -5 ఉన్నవని మోటార్ సైకిల్ వదిలి వెళ్ళిన వాళ్ళు దొరకక పోవడంతో తిరుపతి SI గారు మోటర్ సైకిల్ ను,కర పత్రాలని తీసుకోని స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ ఇవ్వగా CI వెంకటేశ్వర్లు గారు కేస్ నమోదు చేసినట్లు సమాచారం.

0/Post a Comment/Comments

Previous Post Next Post