గ్రామపంచాయతీ కార్యదర్శి నిధుల దుర్వినియోగం



రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఇంటి పన్నులు వసూలు చేసుకుంటూ రెండు  రశీదులు ఇస్తున్నది అని ఆ  గ్రామ ప్రజలు బిజెపి మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి కి చెప్పడంతో  తిరుపతి రెడ్డి రైట్ అఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పూర్తి సమాచారం తీసుకొని గ్రామంలో ఎంక్వయిరీ చేయగా సర్పంచ్ మరియు పాలకవర్గం కు తెలియకుండా గ్రామ పంచాయతీ కి సంబందించిన ఇంటి పన్నులు రశీదు బుక్స్ లో  రాయకుండా,  దొంగతనంగా పంచాయతీ కార్యదర్శి  తానే స్వంతంగా రశీదు బుక్స్   తెచ్చుకొని  గ్రామంలోని  ఇంటి యజమానుల  నుండి ఇంటి పన్నులు వసూలు చేస్తూ రెండు రశీదులు ఇస్తూ  తానే రూపాయలు తీసుకుంట్టుంది అని   ఇట్టి రూపాయలు ఇరుసలు నామ రిజిస్టార్ లో కూడ రాయకుండా ఒక్కొక్కరికి రెండు రశీదులు ఇస్తూ  ఓబులాపూర్ గ్రామం లో ఆగస్టు  నుండి మర్చి వరకు 100000 రూపాయలను అధికార దుర్వినియోగంచేసినది, మరియు రెండు చెక్కులు 60000,  +80000 రూపాయలు ను తన అకౌంట్ కి ట్రాన్సఫర్ చేసుకున్నది  అని తెలపడం తో   ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గమే అయోమయనికి గురైనారు , మేము కార్యదర్శి అంటే అన్నీ పన్నులు ప్రతి నెల వసూలు చేస్తూ STO లో  జమచేస్తాది  కాదా అని అనుకున్నాం కాని ఇలా చేస్తున్నది అనుకోలేదు అంటూ గౌ ll సర్పంచ్ గారే వాపోతున్నారు , ఈ విషయం ను   గ్రామం లోని ఇంటి యజమానుల నుండి ఆమె ఇచ్చిన దొంగ రశీదు లను తీసుకొని ఇల్లంతకుంట మండల ఎంపీడీఓ గారికి కూడా పిర్యాదు చేశారు ఇట్టి విషయం పై ఈ రోజు ఓబులాపూర్ గ్రామ పంచాయతీ కి వెళ్లి ప్రజలను  ఆడగా అందరి నుండి ఆమె ఎంత అమౌంట్ తీసుకున్న వివరాలు, మరియు  నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు నాలుగు మసాలా  గ్రామ పంచాయతీ లో పనిచేసే సిబ్బంది జీతాలు రూపాయలు కుడా ఆమె నే తీసుకున్నది అని సిబ్బంది చెప్పారు ఈ ఆధారాల చెక్స్ నకలు కూడ  MPO  గారు తీసుకుని  గ్రామ పంచాయతీ రికార్డులను కూడా తమ ఆధీనంలోకి తీసుకెళ్లారు. ఇలాంటి కొంతమంది అమాయకపు సర్పంచ్ లు వున్నా చోట  అధికారులు ఇలా నిధుల దుర్వినియోగం చేయడం సిగ్గుచేటు, ఇలాంటి అవినీతి అధికారిని  నుండి నిధులను రికవరీ చేసి ఇలా  జిల్లాలో నిధుల దుర్వినియోగంజరగకుండా  ఈ అధికారినిపై  జిల్లా కలెక్టర్, డీపీఓ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాధనాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారన్నారు
Previous Post Next Post