మావోల బంద్ పాక్షికం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం: విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావును విడుదల చేయాలంటూ శనివారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు మావోయిస్టులు ఇచ్చిన పిలుపు మేరకు చర్ల మండలంలో బంద్ పాక్షికంగా జరిగింది. జూలై 28 నుండి ఆగష్టు 3 వరకు మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరగనున్న నేపధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీ ప్రాంతాలలో అప్రకటిత యుధ్ద వాతావరణం నెలకొనిఉంది. మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ చర్ల మండల సరిహద్దులో ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని విజయపురి కాలనీలో వెంకటాపురం భద్రాచలం ప్రదాన రహదారిపై మావోయిస్టులు రెండు రోజుల క్రితం కరపత్రాలు వదిలారు. రెండు రోజుల క్రితం చర్ల మండలంలోని బత్తినపల్లిలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కు సంబందించిన రెండు వాహనాలను మావోయిస్టులు దహనం చేయడం, గత పది రోజుల క్రితం మణుగూరు ప్రాంతంలో మల్లెతోగు అడవులలో  పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరగడం వంటి సంఘటనలుఉన్నాయి. ఈ నేపధ్యంలో శనివారం రాష్ట్ర బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వగా మండలంలో బంద్ పాక్షికంగా జరిగింది. దుకాణాలు మూసివేయడంతో చర్ల ప్రదాన రహదారి నిర్మానుష్యంగా మారింది. రవాణ వ్యవస్థ పాక్షికంగా స్తంభించింది. మావోయిస్టుల బంద్ నేపధ్యంలో చర్ల ఎస్ హచ్ ఓ టి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో చర్ల ఎస్సై  రజువర్మర్ మండలంలో తగిన బందో బస్తు నిర్వహించారు.
Previous Post Next Post