కరోనా కేసులు పెరుగుతున్నాయి కానీ ఆందోళన చెందాల్సిన పనిలేదు : మంత్రి ఈటెల రాజేందర్



తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని తెలిపారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వేలాది బెడ్లు సిద్ధం చేశామని వెల్లడించారు.సీరియస్ గా ఉన్నవారికే ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలు లేనివారికి ఇంట్లోనే చికిత్స జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో కరోనా మృతుల సగటు 1.52 శాతం మాత్రమేనని అన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక, కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో 15 రోజుల లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తున్నామని, దేశంలోని ఇతర నగరాలు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నాయని తెలిపారు.

Previous Post Next Post