ఘనంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం



విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు మాట్లాడుతూ మన విశ్వవిద్యాలయం ఈ 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎనో విజయాలు సాధించాము అని తెలిపారు. ఈ సందర్బంగా పూర్వ ఉపకులపతులు మరియు రిజిస్ట్రార్ల కృషిని ప్రశంసించారు. మన పూర్వ ఉపకులపతి ఆచార్య సి ఆర్ విశ్వేశ్వరావు గారు విశ్వవిద్యాలనికి స్థల సేకరణ మరియు ఎంతో మందికి ఉద్యోగ కల్పన గాని మరియు తర్వాత వచ్చిన ఆచార్య జీ రాజా రమి రెడ్డి గారు కొత్త భవనాలు కట్టడానికి పూనుకోవటం మరియు ఎంతో మందికి అధ్యాపక అధ్యాపకేతర సిబందిని నియమించడంలో, ఆచార్య వీ వీరయ్య గారు కొత్త కోర్సులు తేవడంలో గాని ఎంతో కృషి చేసారు.మన విశ్వవిద్యాలయం తో పాటి స్థాపించిన ఇతర విశ్వవిద్యాలయాల కంటే మనం ఎంతో ముందు ఉన్నాము అని తెలిపారు. ఈ సంవత్సరం నుంచి కొత్త కోర్సులు మొదలుపెడతామని, కొత్త భవనాలు కడతామని, విద్యార్థులకు ఇంకా ఎనో వసతులు కలిపిస్తామని తెలిపారు. మన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12 బి గుర్తింపు రావడం, మన కానవొకేషన్ కార్యక్రమానికి దేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు మరియు మన రాష్ట్ర గవర్నర్ బిశ్వభుసం హరిచందన గారు హాజరు అవడం వంటి కార్యక్రమాలు మన విశ్వవిద్యాలయానికి  ఎంతో ఖ్యాతిని తెచ్చాయి అని తెలిపారు. ఈ ఆవిర్భావదినోత్సవ సందర్బంగా కొత్తగా అధ్యాపకులకు మరియు అధ్యాపకేతర సిబందికి అవార్డు లు ప్రధానం చేసే సంస్కృతిని ప్రారరభించబోతున్నామని తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా డాక్టర్ ఏ పీ జె అబ్దుల్ కలం విగ్రహాన్ని ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు, రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య మరియు రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ ఆవిర్బాహ్వ దినోత్సవం లో ఆధాపకులు, అధ్యాపకేతర సిబంది, ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్ డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి గారు పాలుగొన్నారు.
Previous Post Next Post