యువ సేవ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  మానకొండూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం  ఆధ్వర్యంలో  యువసేవా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మాదాపూర్ గ్రామంలో నూతన కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మరియు కాసీంపేట గ్రామములో వార సంత భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గన్నేరువరం మండల కేంద్రంలోని యువత సమాజానికి మేలు చేకూరేలా వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతూ యువతను చెడు ధరలో పోనివ్వకుండా ఒక సదుద్దేశంతో ముందుకు తీసుకెళ్ళు నమ సమాజానికి పాటు పడుతున్నారని దానికి కృషి చేస్తున్న యువజన నాయకుడు గూడూరు సురేష్ ను అభినందించారు అదేవిధంగా స్వరాష్ట్రంలో లో సాగునీరు కొదువ లేకుండా దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి కలను సాకారం చేసారని  అందులో భాగంగా దాదాపు అన్ని కాలువల నిర్మాణం పూర్తి అయిందని ఇప్పుడు గన్నేరువరం మండలానికి సంబంధించి కాల్వల నిర్మాణం లో కృషి చేసినప్రజాపర్తినిదులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈకార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ,సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post