మేమేం పాపం చేసాం ? మాకు న్యాయం చేయరా సారూ ......



ఈయన పేరు.. లాన్స్‌నాయక్‌ రాంచందర్‌. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో శత్రువుల ఫిరంగిదాడుల్లో అమరుడయ్యారు. కేంద్రం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది. బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డు వద్ద ఆయన కుటుంబానికి 300 గజాల స్థలం ఇస్తామని కూడా అప్పటి సర్కారు ప్రకటించింది. 20 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఆ కుటుంబానికి ఆ స్థలం అందలేదు. లాన్స్‌ నాయక్‌ రాంచందర్‌ భార్య దివ్య.. తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయానికి చెప్పులరిగేలా తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యోగమూ రాలేదు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి దీనంగా మారింది. 2000లో ఇంటి స్థలం ఇస్తామంటూ కలెక్టర్‌ కార్యాలయానికి పిలిపించి ఉత్త కాగితాలను ఇచ్చి పంపించారని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం అధికారుల చుట్టూ ఎన్నో సార్లు తిరిగినా ఉపయోగం లేకపోయిందన్నారు. కల్నల్‌ సంతో్‌షబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు, ఉద్యోగం, ఇంటిస్థలం మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే.. తనకు కూడా ప్రభుత్వం ఇంటి స్థలం, ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకిలా జరుగుతోంది? కొందరు చనిపోయినప్పుడు ప్రభుత్వం వెంటనే సహాయం అందజేస్తుంటే.. మరికొందరికి హామీ ఇచ్చిన సహాయం కూడా అందట్లేదు. ఎందుకీ పరిస్థితి ఎదురవుతోంది?

తెలంగాణ ప్రభుత్వం 2018లో విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం సైనికులకు చెల్లించే నగదు అవార్డు వివరాలు...



సైనికుడి బిరుదు నగదు బహుమతి

పరమ వీర చక్ర రూ. 2.25 కోట్లు

అశోక చ క్ర రూ. 2.25 కోట్లు

మహ వీర్‌ చక్ర రూ. 1.25 కోట్లు

కీర్తి చక్ర         రూ. 1.25 కోట్లు

వీర్‌ చక్ర         రూ. 75 లక్షలు

శౌర్య చక్ర         రూ. 75 లక్షలు

సేనా, వాయు మెడల్స్‌  రూ. 30 లక్షలు

పరాక్రమ్‌ మెడల్స్‌  రూ. 25 లక్షలు

సర్వోత్తం యుధ్‌ సేవా  రూ. 25 లక్షలు

ఉత్తం యుధ్‌ సేవా  రూ. 20 లక్షలు

యుధ్‌ సేవా           రూ. 5 లక్షలు
Previous Post Next Post