ఎమ్మెల్యే కార్యక్రమం ముందు బిజెపి నాయకులు ధర్నా నిరసన అరెస్టు చేసిన పోలీసులు



రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్ని చెరువులలో  నీళ్లు నింపాలని, అనంతరం చెరువు నింపి ఆ చెరువు ద్వారా బిక్కవాగు లోకి నీటిని వదిలి అన్ని గ్రామాల రైతులకు రైతులకు న్యాయం చేయాలని, మండలం లోని ప్రతి ఎకరాకు కెనాల్  ద్వారా  నీళ్లు ఇచ్చి ఇల్లంతకుంట మండలన్ని  సస్యశ్యామలం చేయాలనీ ఎమ్మెల్యే కార్యక్రమన్ని అడ్డుకోని నిరసన వ్యక్తంచేసిన  బిజెపి నాయకులను రైతులను  అక్రమంగా ప్రజాస్వామ్యంన్ని  కూని చేస్తూ పోలీస్ అధికారులతో  అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి మండల శాఖ అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మండలంలోని  ప్రాజెక్టులలో సర్వం కోల్పోయిన ఇల్లంతకుంట  మండలంలోని  మిడ్ మానేరు,అనంతగిరి ప్రాజెక్టు లో 877 కుటుంబలను,1300ఎకరాల భూమిని, ఓబులాపూర్ కెనాల్ లో 300ఎకరాలను  కోల్పోయిన    రైతుల కు  ప్రభుత్వం బాసటగా ఉండాలి కానీ అన్ని ప్రాజెక్టులు మండలంలో నిర్మించిన మండల రైతులకు చుక్క నీరు అందకుండా  పక్క జిల్లాలకు నీటిని తరలిస్తుంటే మండలంలోని రైతులు కన్నీళ్లు పెడుతువుంటే జిల్లా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తూ కూర్చుంటున్నారు ఇప్పట్టికైనా మీకు ఓట్లు వేసిన  రైతులకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేశారు ఇల్లంతకుంట మండలం రైతులకు న్యాయం చేయాలని మండలంలోని కాలువల ద్వారా అన్ని చెరువు నింపాలని లేనియెడల రైతుల పక్షాన తీవ్ర ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి నాగ సముద్రాల సంతోష్,,  ఉపాధ్యక్షులు గుంటి మహేష్, బత్తిని సాయి గౌడ్, బండారి రాజు, బొల్లారం ప్రసన్న,బత్తిని స్వామి, ఇట్టి రెడ్డి లక్ష్మారెడ్డి, సామ రమణారెడ్డి, సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సుధగోని శ్రీకాంత్ గౌడ్, గజ్జల శ్రీనివాస్, రాకేష్ రెడ్డి, అక్యాం  మధు, గుంటి మల్లికార్జున్, ఒగ్గెర ముత్యం,  మండల ప్రచార కార్యదర్శి సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ గౌడ్, దురముట్ల ముత్యం, భూమేష్, జిర్ర అనిల్ కుమార్, వరుకోలు తిరుపతి, సుదగోని రాజు, కోమటిరెడ్డి అనిల్ , 50 మంది రైతులు పాల్గొన్నారు.


Previous Post Next Post