కల్నల్_అశుతోష్‌శర్మ....



నిన్న జమ్మూకాశ్మీర్‌లోని హండ్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చివరి ఘట్టంలో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిలోకి జవాన్లు ప్రవేసించే తరుణంలో ఒక్కసారిగా వందల మంది స్థానికులు వచ్చి ఉగ్రవాదులకు రక్షణ కవచంగా నిలబడ్డారు..

దానితో కాల్పులు జరిపితే స్థానికులు చనిపోతారని ఆర్మీ జవాన్లు కాల్పులు జరపలేదు..
ఇదే అదునుగా తీసుకుని స్థానికుల మధ్యలో ఉన్న ఉగ్రవాదులు ఒక్కసారిగా బయటకు వచ్చి జవాన్లపై కాల్పులు జరిపారు..
దానితో ముగ్గురు జవాన్లు, ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరియు ఒక కల్నల్‌తో సహ మొత్తం ఐదు మందిని భారత సైన్యం కోల్పోయింది..

ఒక కల్నల్ ర్యాంకు ఆఫీసర్ చనిపోవడం గత 5 ఏళ్ళలో ఇదే మొదటిసారి..
ఈయన పేరు కల్నల్ అసుతోష్ శర్మ..
22వ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్..
జమ్మూకాశ్మీర్‌లో ఎన్నో ఎన్‌కౌంటర్‌లకు నాయకత్వం వహించారు..
ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఇంతకుముందు రెండుసార్లు అవార్డులు వచ్చి ఉన్నాయి..
ఆయనకు భార్య మరియు ఇంటర్‌మీడియట్ చదివే కుమార్తె ఉన్నారు..
#స్థానికులు మరియు #ఉగ్రవాదులు కలిసి ఆడిన నాటకంలో భాగమే ఈ ఎన్‌కౌంటర్ అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి..

నిన్న ఎన్‌కౌంటర్‌ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందటి ఫోటో ఇది....
Previous Post Next Post