మాదాపూర్-గునుకుల కొండాపూర్ క్లస్టర్లో నియంత్రిత పంటల సాగు విధానం పై అవగాహన సదస్సు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని శుక్రవారం నియంత్రిత పంటల సాగు విధానం పై అవగాహన సదస్సుకు మాదాపూర్ క్లస్టర్ మరియు  గునుకుల కొండాపూర్ క్లస్టర్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ పంటమార్పిడి విషయమై మాట్లాడుతూ వరిలో సన్న రకాలని సాగు చేయాలని సూచించారు, కంది కి  మరియు పత్తికి మార్కెట్ లో డిమాండ్ ఉన్నందున రైతులు  ఇట్టి పంటల వైపు దృష్టి పెట్టాలని  సూచించారు మానకొండూర్ ఏడిఏ శ్రీనివాస్ మాట్లాడుతూ విత్తన శుద్ధి చేయకుండా పంటలు వేస్తే రైతులు నష్టపోతారని సూచించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరిలో సన్న రకాలు తెలంగాణ సోనా మరియు బిపిటి, హెచ్ఎంటి వంటి వడ్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ సోనా వడ్లు మాత్రం జులై 15 తర్వాతనే నారు పోసుకోవాలని సూచించారు, ఈ రకము మన వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనది అని తెలిపారు ఈకార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్,ఎంపీపీ ల ఫోరం జిల్లా  అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, సర్పంచ్ లింగంపల్లి జ్యోతి, కర్ర రేఖ, కుమ్మరి సంపత్, తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post