వలస జీవుల దయనీయ పరిస్థితి పై రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం నోటీసులు



లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. వలస కూలీల కష్టాలు తీర్చడానికి తీసుకున్న చర్యలేంటో తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా, వలస కూలీల ప్రయాణాలు, ఆశ్రయం, ఆహారం అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post