కరోనాపై సీఎం జగన్ సమీక్ష



ఏపీలో కరోనా వ్యాప్తిపై సీఎం జగన్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ, కరోనా ఎవరికైనా వస్తుందని, కరోనా వైరస్ సోకడం పాపం, నేరమేమీ కాదని స్పష్టం చేశారు. అయితే, కరోనా పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను, భయాందోళనలను తొలగించాలని సూచించారు. ఈ వైరస్ పై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని తెలిపారు. తగిన జాగ్రత్తలతో వైరస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని, ఒకవేళ వైరస్ సోకినా వైద్య సాయంతో కోలుకోవచ్చని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post